ఏలూరు: పొగాకు క్వింటాళ్లు ధర రూ.3380

వర్జీనియా రైతులు ఆశా నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు. కొనుగోలుదారుల దయాదక్షిణ్యాలపైనే రైతు భవిష్యత్ ఆధార పడినట్టు ఆవేదన వ్యక్తం జేస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో శుక్రవారం పొగాకు ధర మరో రూపాయి పెరిగి క్వింటాలు రూ 3380/-చేరింది. పొగాకు వేలం మొదలై సుమారు మూడు మాసాలు కావస్తోంది. వేలం ఆరంభ ధర క్వింటాలు రూ 2900/-
తో మొదలయింది. ఎట్టకేలకు ఐదు, పది రూ పాయి రెండు పెంచుతూ, 3380/-కి పెంచారని రైతులు వాపోయారు.

సంబంధిత పోస్ట్