దేవాలయాల్లో దొంగతనాలు చేసిన అంతర్రాష్ట్ర దొంగ ఈమని రాంబాబునుపోలీసులు పట్టుకున్నారు. ఏలూరు మినీ బైపాస్ వద్ద శుక్రవారం ఏలూరు 3 టౌన్ పోలీస్ సిబ్బంది అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అతని వద్ద నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు, నేరంలో ఉపయోగించిన బైక్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇతనిపై ఇప్పటివరకు 50 వరకు కేసులు నమోదయ్యాయన్నారు.