ఏలూరు మండలం వంగాయగూడెంలో స్థలం వివాదంలో గొడవకు పాల్పడిన దాసరి వీరస్వామి, రాంబాబు, మిరియాల రంగారావుకు ఏలూరు సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి రజిని రూ. 1000 జరిమానా, మూడు నెలల జైలు శిక్ష బుధవారం విధించారు. 2019 జూలైలో ముక్కు గౌతమ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంటి స్థలంలో గొడవకు దిగి దాడికి పాల్పడినట్లు నేరం రుజువైనందున శిక్ష విధించినట్లు జడ్జి తెలిపారు.