ఏలూరు 8వ డివిజన్ తూర్పు వీధిలోని సింహాల సంధులో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, జనసేన కార్యకర్త వెన్నవల్లి తారకరామ్ ప్రసాద్ నివాసం పూర్తిగా దగ్ధమయ్యింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని నగదు, బంగారం, దుస్తులు, ఫర్నిచర్ సహా ఇతర గృహోపయోగ వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మేరకు శుక్రవారం బాధ్యత కుటుంబాన్ని జనసేన ఇన్ ఛార్ద్ అప్పలనాయుడు పరామర్శించారు.