ఏలూరులో ఘనంగా అంతర్జాతీయ శ్రామిక దినోత్సవ వేడుకలు..

ఏలూరులో అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డు ఐఎఫ్టియు కార్యాలయం, వన్‌టౌన్ మార్కెట్ సెంటర్, మెయిన్ బజార్ కన్నయ్య పార్క్ వద్ద హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, వారి శ్రమకు తగిన గుర్తింపు రావాలని" ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల హక్కులు, వారి సంక్షేమంపై దృష్టి సారించారు.

సంబంధిత పోస్ట్