జంగారెడ్డిగూడెం: యువకుడిపై భార్య బంధువులు దాడి

జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన రమేశ్, వీరంపాలెం గ్రామానికి చెందిన గంగోత్రి కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. శుక్రవారం ఏలూరులో వివాహం చేసుకుని లక్కవరం పోలీసులను ఆశ్రయించారు. శనివారం అర్ధరాత్రి గంగోత్రి బంధువులు రమేశ్ ఇంటిపై దాడి చేసి ఆమెను తీసుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు గంగోత్రిని ఆదివారం రమేశ్‌కు అప్పగించారు.

సంబంధిత పోస్ట్