జీలుగుమిల్లి: జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీ

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో మంగళవారం జాతీయ రహదారిపై రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్లకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ల అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్