బుధవారం అత్తిలి మండలం తిరుపతి పురం పశువుల ఆసుపత్రి వద్ద ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి డాక్టర్ మల్లిపూడి చిన బాబురావు మాట్లాడుతూ, పాడి ఉన్న ఇంట చిరులు పంట అని అన్నారు. మండల పశువైద్య అధికారి డాక్టర్ భవాని శంకర్ పశువులకు ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. శిబిరంలో 200 పశువులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు.