నరసాపురం క్రోచెట్‌ లేస్‌ ప్రొడక్ట్స్‌కు ఒడిఒపి అవార్డు

న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఒడిఒపి అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని 'నరసాపూర్ క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్'కు అవార్డును అందుకున్నారు. కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ చేతుల మీదుగా అవార్డును అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 7 ఉత్పత్తుల్లో నరసాపురం లేస్‌ ప్రొడక్ట్స్‌కు ఒడిఒపి అవార్డు లభించింది.

సంబంధిత పోస్ట్