ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు 29 బ్యాక్ లాగ్ ఉద్యోగాలను కేటాయిస్తూ కలెక్టర్ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిభావంతుల సహాయ సంచాలకులు రామ్ కుమార్ మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఏప్రిల్ 21 సాయంత్రం 5 గంటలలోపు 18 నుంచి 52 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం http://eluru.ap.gov.in వెబ్‌సైట్‌లోని (SRD-Backlog Vacancies Notification for Persons with Disabilities) ను పరిశీలించవచ్చని తెలిపారు.