ఏలూరు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నవంబర్ 1వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుందని కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ పంపిణీలో 5,074 మంది సచివాలయ సిబ్బంది పాల్గొంటారు. అక్టోబర్ నెలకు సంబంధించిన పింఛన్ల చెల్లింపులు నవంబర్ 1న జరుగుతాయి. ఈ నెలలో ఇప్పటికే 2,60,036 మందికి రూ. 113.72 కోట్లు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. నవంబర్ 1న పింఛన్ తీసుకోలేని వారికి 3వ తేదీన అందజేస్తామని కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు.