పోలవరం సబ్ యూనిట్ పిహెచ్‌సి ఎల్ఎన్‌డి పెట పరిధిలోని గూటాల సబ్ సెంటర్, గూటాల సచివాలయం పరిధిలో మలేరియాపై ప్రజలకు అవగాహన కల్పించారు. మంచినీటి నిల్వల్లో పెరిగే అనోఫిలిస్ దోమల వల్ల మలేరియా జ్వరం వస్తుందని, అందరూ దోమతెరలు వాడాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి ఎల్ఎన్‌డి పెట పోలవరం సబ్ యూనిట్ హెచ్‌వి, హెచ్‌ఏ, అన్నా, ఆశా పాల్గొన్నారు.