ఏలూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు శుక్రవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా నిడమర్రు మండలంలో 12.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు రూరల్‌లో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్లు నమోదైంది. 16 మండలాల్లో ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా మొత్తం మీద సగటున 2.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.