ద్వారకా తిరుమల మండలం జి కొత్తపల్లి గ్రామంలో దశాబ్దాలుగా స్మశాన వాటికకు దారి లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, రైతులు తమ సమస్యను సొసైటీ ప్రెసిడెంట్ రేగంటి రాంబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, స్మశాన వాటికకు అవసరమైన గ్రాంటును విడుదల చేయాలని కోరారు. శాసనసభ్యులు సానుకూలంగా స్పందించి, రూ.20 లక్షల గ్రాంటును మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, రైతులు, ప్రజలు శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు, సొసైటీ ప్రెసిడెంట్ రేగంటి రాంబాబు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.