కామవరపుకోటలోని శశి విద్యాసంస్థకు చెందిన చాపల స్నిగ్ధ గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచింది. మొత్తం 600 మార్కులకు గానూ 591 మార్కులు సాధించి ద్వితీయ మండల స్థాయి ర్యాంకును కైవసం చేసుకుంది. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల బోధనే కారణమని స్నిగ్ధ ఆనందం వ్యక్తం చేసింది.