ఏలూరు జిల్లాలో శనివారం జరిగిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సదస్సులో, జిల్లా జేఏసీ ఛైర్మన్ శ్రీనివాస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పరిష్కారం లభించని పక్షంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కార్యాచరణకు సిద్ధం కావాలని ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.