వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం: నేటి విద్యార్థులే రేపటి మేధావులు

ఏలూరులోని కామవరపుకోట శాఖ గ్రంథాలయంలో 40 రోజుల వేసవి విజ్ఞాన శిబిరాన్ని ఎంఈఓ ఎం. సుబ్బారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి విద్యార్థులే భవిష్యత్తు మేధావులని, ఆ ఘనత గ్రంథాలయాలకే దక్కుతుందని అన్నారు. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాన్ని వేరే చోటికి మార్చాలని సూచిస్తూ, తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. టీవీఎస్ రాజు మాట్లాడుతూ గ్రంథాలయ పఠనం వల్లే అనేకమంది ఉన్నత అధికారులుగా స్థిరపడ్డారని, యువత పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ షేక్ ఇబ్రహీం, లైబ్రేరియన్ అరుణ్ కుమార్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్