కొల్లేరులో పక్షుల మనుగడకు ముప్పు: కాలుష్యం, చేపల కొరతతో వలస పక్షుల సంఖ్య తగ్గుదల

ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన కొల్లేరు చిత్తడి నేలలు ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం తగ్గడం, పక్షుల ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోవడంతో ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోంది. మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి, ఆటపాక పక్షుల కేంద్రంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. పట్టణాలు, నగరాల నుండి వచ్చే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు శుద్ధి చేయకుండానే సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. అనధికార రొయ్యల, చేపల చెరువుల్లో వాడే రసాయనాలు, పురుగుమందుల వల్ల మిగిలిన కొద్దిపాటి నీరు కూడా విషతుల్యంగా మారుతోంది. దీనివల్ల స్థానిక చేపల జీవవైవిధ్యం కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్