ఏలూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. శాంతినగర్ మూడో రోడ్డులోని ఒపేరా అపార్ట్మెంట్ వాచ్ మెన్ శ్రీనివాస్ శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతుడిది దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామం కాగా, భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.