ఏలూరు టూ టౌన్ హెడ్ వాటర్ వర్క్స్ సమీపంలో పనుల నిర్వహణ, డిస్ట్రిబ్యూషన్ పంపింగ్ మెయిన్ మరమ్మతులు కారణంగా శనివారం సాయంత్రం నగరంలోని వివిధ ప్రాంతాలు, కాలనీలకు నీటి సరఫరా ఉండదని కమిషనర్ భానుప్రతాప్ తెలిపారు. ఆర్ఆర్ పేట, నరసింహరావుపేట, కోర్టు, పాలకేంద్రం ఏట్టిగట్టు, లంకపేట ఇజ్రాయల్ పేట, రాణి నగర్, సంతోష్ నగర్, పాములదిబ్బ, బాలయోగి వంతెన ప్రాంతాలు, చేపలతూము సెంటర్లలో కుళాయిల ద్వారా నీటి సరఫరా ఉండదన్నారు.