ఏలూరు జిల్లా వైసీపీ సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కైకలూరు వైసిపి క్యాంపు కార్యాలయంలో జరిగింది. మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై, జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు. నాయకులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.