మండవల్లి రైల్వేస్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగేలా చూడండి

కైకలూరులోని CNR గార్డెన్‌లో డాక్టర్ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ కార్యక్రమానికి విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు, మండల బీజేపీ నాయకులు ఒక వినతిపత్రం అందజేశారు. మండవల్లి రైల్వేస్టేషన్ వద్ద ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలుపుదల చేయాలని, అలాగే రిజర్వేషన్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ద్వారా ఈ అభ్యర్థనను కేంద్ర మంత్రికి సమర్పించారు.

సంబంధిత పోస్ట్