కైకలూరు: చెరువులో పడి యువకుడు మృతి

మండవల్లి లో ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భైరవపట్నం గ్రామానికి చెందిన పండు జోజి పెద్ద కుమారుడు పండు తరుణ్ అలియాస్ చందు ( 23 ) గురువారం మధ్యాహ్నం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు శుక్రవారం ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో  ఇంటి పక్కనే ఉన్న చేపల చెరువులో  చందు మృతదేహం  తేలినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్