కైకలూరు: పెద్దింటి అమ్మవారికి రూ. 81, 206 ఆదాయం

కైకలూరు మండలం కొల్లేటికోట శ్రీ పెద్దింటి అమ్మవారి దేవస్థానానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈఓ తెలిపిన వివరాల ప్రకారం, వివిధ సేవలు, ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ. 81, 206 ఆదాయం సమకూరింది. అంతరాలయ దర్శనం ద్వారా రూ. 23,500, ప్రత్యేక దర్శనాల ద్వారా రూ. 6,870 లభించాయి. కేశఖండనశాల, తీర్థాల ద్వారా మిగిలిన ఆదాయం వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్