కైకలూరు: ఈనెల 12న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కైకలూరులో బుధవారం సీఐటీయూ, రైతు సంఘం నాయకులు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక, రైతాంగ చట్టాలను నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్