కైకలూరు: వైసీపీ సర్పంచులకు ఘన సన్మానం

కైకలూరు - ఏలూరు రోడ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రాత్రి కైకలూరు నియోజకవర్గ సర్పంచుల అభినందన సభ జరిగింది. నియోజకవర్గంలోని సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని సత్కరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ, సర్పంచులు తమ పదవీకాలంలో గ్రామాలకు చేసిన సేవలు, అభివృద్ధి మరువలేనివని, అవి ప్రజల మనస్సుల్లో చిరస్మరణీయంగా ఉంటాయని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్