ముదినేపల్లి ఐటిఐలో చేరే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కూనపు రెడ్డి సత్యనారాయణ కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో తక్షణ ఉపాధికి ఐటిఐ కోర్సులు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. స్థానిక స్పామ్ ఐటిఐలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ట్రేడ్స్ అందుబాటులో ఉన్నాయని, ఇవి రెండేళ్ల కోర్సులని, ఈనెల 30లోగా చేరాలని సూచించారు.