ముదినేపల్లి మండలం పెదపాలపర్రు సబ్ స్టేషన్ పరిధిలోని పేరూరు 11కేవీ ఫీడర్ పరిధిలో గురువారం విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ జీబీ శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. ఫీడర్ పరిధిలో జంగిల్ క్లియరెన్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలుపుదల చేస్తామని చెప్పారు. పెదపాలపర్రు, రెడ్డిపూడి, పర్నాస, పేరూరులోని గృహ, వాణిజ్య, ఆక్వా విద్యుత్తు వినియోగదారులు సరఫరా ఉండదన్నారు.