బీచ్ లో తప్పిపోయిన చిన్నారి... చాకచక్యంతో పట్టుకున్న పోలీసులు

మంగళవారం ఉదయం పెరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తుండగా అదృశ్యమైన ఏడేళ్ల బాలిక సుస్మితను మొగల్తూరు పోలీసులు సకాలంలో స్పందించి, గాలింపు చేపట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా పోడూరు మండలం, కవిటం గ్రామానికి చెందిన తాడిపర్తి రాజబాబు కుటుంబం బీచ్‌లో ఉండగా, బాలిక కనిపించకుండా పోయింది. పోలీసు కానిస్టేబుల్ సహాయంతో గాలింపు చేపట్టి, ఒక దాబా వద్ద ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్