నరసాపురం మండలంలోని మల్లవరం గ్రామానికి ఇన్‌ఛార్జి సర్పంచిగా పులఖండం ఆదివిష్ణు శేషు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఉపసర్పంచిగా కొనసాగుతున్న ఆయనను తాత్కాలిక సర్పంచిగా నియమించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గ్రామ పాలకవర్గ సభ్యులు, స్థానికులు శేషును అభినందించారు. గతంలో సర్పంచిగా పనిచేసిన సుజాతపై నిధుల దుర్వినియోగ ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు ఆమెను నాలుగు నెలల పాటు సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న కార్యదర్శులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.