నరసాపురం(M) సీతారాంపురం సౌత్ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. సోమవారం అర్ధరాత్రి సీతారాంపురం సెంటర్‌లోని విగ్రహం చేతిని, మంగళవారం అర్ధరాత్రి పిల్లిపేటలోని మరో వైఎస్ఆర్ విగ్రహం చేతి వేళ్లను విరగ్గొట్టారు. 24 గంటల వ్యవధిలోనే రెండు విగ్రహాలను లక్ష్యంగా చేసుకోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.