మొగల్తూరు మండలంలోని 'మినీ గోవా'గా పేరుగాంచిన పేరుపాలెం, కేపీపాలెం బీచ్‌లు ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడాయి. సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సముద్ర తీరమంతా జనసందోహంతో కలకలలాడింది. పర్యాటకులు కొబ్బరి తోటల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకుని ఉత్సాహంగా గడిపారు. సందర్శకుల తాకిడితో బీచ్ పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.