పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి నరసాపురం పట్టణానికి చెందిన తెలగంశెట్టి దుర్గారావు, వెంకట శేషవేణి దంపతులు ఆదివారం రూ.51,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.