నరసాపురం మండలం పసలదీవిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామానికి చెందిన లంక సీతమ్మ కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించి తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న నగదు, బంగారం, ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని బాధితులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.