పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం నియోజకవర్గం, మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని బండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును మాధవ నాయుడు కోసి ప్రజలకు పంపిణీ చేశారు. వేడుకలకు ముందు, మాధవ నాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.