గల్ఫ్ లో ఉద్యోగం పేరుతో మోసం.. ఏజెంట్‌కు రిమాండ్

గల్ఫ్ దేశంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసులో పెనుగొండకు చెందిన షేక్ అబ్దుల్ సలీమ్ ను నరసాపురం టౌన్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. బాధితుడు ముస్కుడి రమేష్ కు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, ఇంటి పనిలో చేర్పించడంతో అతని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు సీఐ యాదగిరి తెలిపారు.

సంబంధిత పోస్ట్