దాతల సహకారంతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు

మొగల్తూరులోని నెంబర్ టు పాఠశాలకు భాష ఏజెన్సీస్ అధినేత జాకీర్ హుస్సేన్ సుమారు 20వేలు వెచ్చించి కంప్యూటర్ ను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జి నాన్సీ మాట్లాడుతూ, దాతలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. చిన్నారులకు కంప్యూటర్ పై అవగాహన కల్పించారు. పాఠశాల సిబ్బంది జాకీర్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్