గడ్డి ట్రాక్టరు బోల్తా

నరసాపురం పట్టణ పరిధి రుస్తుంబాద వద్ద బుధవారం గడ్డితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న మార్గం ఎత్తుగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారి అభివృద్ధి చేసి ఏళ్లు గడుస్తున్నా, వీధి మార్గాలను అనుసంధానం చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్