పేరుపాలెం సౌత్ వినాయక ఆలయంలో హుండీ చోరీ, నగదు అపహరణ

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ సెంటర్ లోని వినాయకుడి ఆలయంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం నుండి హుండీని దొంగిలించి, అందులోని నగదును అపహరించుకుపోయారు. దుండగులు హుండీని ఆలయ సమీపంలోని ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్