పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరా ప్రియదర్శిని గాంధీ విగ్రహానికి తగిన గౌరవం లభించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకులు తమ ఫ్లెక్సీలు పడిపోకుండా ఇందిరా గాంధీ విగ్రహం మెడకు తాడు బిగించి, కర్రలు కట్టి, ఫ్లెక్సీలకు సపోర్ట్ కర్రలను వేలాడదీయడం ద్వారా ఆమె గౌరవాన్ని మంటగలుపుతున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది ఇందిరా గాంధీకి జరుగుతున్న అవమానమని పలువురు అభిప్రాయపడుతున్నారు.