భాషా ఏజెన్సీ జాకీర్ హుస్సేన్ పాఠశాలకు కంప్యూటర్ బహుకరణ

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మొగల్తూరులోని మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 2 కు శుక్రవారం, భాషా ఏజెన్సీ జాకీర్ హుస్సేన్ 20వేల రూపాయల విలువైన కంప్యూటర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. నాన్సీ, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ కు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. అనంతరం ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఝాన్సీ, విజయశ్రీ, జానీ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్