మొగల్తూరు మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్ నెంబర్ 2 కు శుక్రవారం, భాషా ఏజెన్సీ జాకీర్ హుస్సేన్ రూ.20వేల విలువైన కంప్యూటర్ ను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి. నాన్సీ, ఉపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ కు ధన్యవాదాలు తెలిపి, పాఠశాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం ఆయనకు చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఝాన్సీ, విజయశ్రీ, జానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలో జరిగింది.