ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలు: మత్స్యకారులను ఆదుకున్న ఘనత

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవి ఈస్ట్ లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ జన్మదిన వేడుకలను ఆయన నివాసంలో ముందుగానే నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు తిరుమణి డేవిడ్ రాజు మాట్లాడుతూ, తుఫాను సమయంలో సముద్ర తీరంలోని మత్స్యకార కుటుంబాలను ఆదుకున్న ఘనత ఎమ్మెల్యే నాయకర్ కే దక్కుతుందని కొనియాడారు. మూడు రోజులు గ్రామాల పర్యటించి యోగక్షేమాలు తెలుసుకున్న నాయకుడికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జిల్లా మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు మెలా వసంతరావు, తిరుమణి సీతామాలక్ష్మి, జనసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్