మొగల్తూరు పేటపల్లంలోని శ్రీ కోదండరామాలయంలో ఆషాడ మాసం సందర్భంగా సీతమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. వివిధ కాయగూరలు, పండ్లతో విరాజిల్లేలా అలంకరించగా, భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.