మొగల్తూరు: జూద స్థావరంపై పోలీసులు దాడి

మొగల్తూరు మండలం కేంద్రంలోని ఓ లాడ్జిలో పేకాట స్థావరంపై గురువారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో పలువురుని అదుపులోకి తీసుకొని నిందితుల నుంచి రూ. 16,700 నగదు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్