హైదరాబాద్‌కు చెందిన బక్క మహేష్ బుధవారం సాయంత్రం మొగల్తూరు బీచ్‌లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే అప్రమత్తమైన మొగల్తూరు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పీ సత్యనారాయణ, మెరైన్ పోలీసుల సహాయంతో బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించి, పేరుపాలెం హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడు కోలుకున్నారని వైద్యులు తెలిపారు. సకాలంలో స్పందించి వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ సత్యనారాయణ, పోలీసులకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.