మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంప గ్రామంలో శుక్రవారం కోడి పందేల శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మొగల్తూరు ఎస్సై జి. వాసు తెలిపారు. వారి నుంచి ఐదు కోడి పుంజులు, 39 కోడి కత్తులు, రూ. 8,100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.