నర్సాపురం పట్టణంలో ఫాన్సీ వ్యాపారి ప్రసాద్ అప్పుల బాధతో ఆర్థికంగా చితికిపోగా, వడ్డీ వ్యాపారస్థులతో కలిసి MRPS నాయకులు ఆదివారం అతని ఇంటిపై దాడి చేశారు. తప్పుడు అగ్రిమెంట్ తో తాళాలు పగలగొట్టి బెదిరింపులకు పాల్పడగా, బాధితుడు డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని MRPS నాయకులను మందలించి స్టేషన్‌కు రావాలని చెప్పినా, వారు వినకుండా బాధితుడిపై దాడికి ప్రయత్నించారు. చట్టపరంగా చూసుకోవాలని పోలీసులు వారిని పంపించివేశారు. ఈ దాడిపై బాధితుడు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గతంలో కూడా ఈ MRPS నాయకులపై బెదిరింపుల కేసులు ఉన్నట్లు సమాచారం.