నరసాపురం 25వ వార్డు వైఎస్సార్ నగర్‌కు చెందిన కాటం ఫణివర్ధన్ ఇంటి ముందు నిలిపిన బైక్ చోరీకి గురైంది. ఈ నెల 2న రాత్రి తన బైక్‌ను ఇంటివద్ద పార్క్ చేయగా, మరుసటి రోజు ఉదయం చూసేసరికి అది కనిపించలేదు. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బుధవారం బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎస్. ముత్యాలరావు తెలిపారు.