నరసాపురం: తల్లి పేరుతో మొక్కను నాటిన బీజేపీ నేతలు

నరసాపురం మండలం సీతారామపురంలో బీజేపీ నాయకులు 'తల్లి పేరుతో మొక్క' కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక శివాలయం వద్ద తులసి మొక్కలను నాటారు. నరసాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ సతీశ్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ప్రతి పౌరుడు తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటాలన్నారు. ఆ మొక్క సంరక్షణ బాధ్యతను కన్నతల్లి వలే చూసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్